మాకవరపాలెం: కారు ఢీకొని భార్యాభర్తలకు గాయాలయ్యాయి. గొలుగొండకు చెందిన బంగారు బాలకృష్ణ, గంగాభవానీ స్కూటీపై శుక్రవారం కశింకోట మండలం తాళ్లపాలెంలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న తమ కుమార్తెను దసరా సెలవులకు తీసుకువచ్చేందుకు బయలుదేరారు. మండలంలోని సర్పానది వంతెన సమీపంలోకి వచ్చేసరికి నర్సీపట్నం వెళ్తున్న కారు మొదట స్యూటీని ఢీకొని ఆపై రోడ్డ పక్కన చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో బాలకృష్ణకు స్వల్ప గాయాలు కాగా, భార్య గంగాభవానీకి కుడికాలు విరిగిపోయింది. వీరిని ప్రాథమిక చికిత్సల అనంతరం 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులో ఉన్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. స్కూటీ నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భార్యాభర్తలకు గాయాలు


