వచ్చేనెల 3 నుంచి మత్స్య మాడుగులమ్మ జాతర | - | Sakshi
Sakshi News home page

వచ్చేనెల 3 నుంచి మత్స్య మాడుగులమ్మ జాతర

Apr 4 2026 7:37 AM | Updated on Apr 4 2026 7:37 AM

జి.మాడుగుల: మండల కేంద్రంలోని గంతకొండపై కొలువై ఉన్న శ్రీ మత్స్య మాడుగులమ్మ తల్లి జాతర మహోత్సవాలను వచ్చే నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించాలని ఉత్సవ కమిటీ, గ్రామ పెద్దలు నిర్ణయించారు. శుక్రవారం స్థానిక మాడుగులమ్మ తల్లి ఆలయ ఆవరణలో గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జాతర నిర్వహణపై చర్చించి, నూతన ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా మత్స్యరాస రామరాజు, ప్రధాన కార్యదర్శులుగా గసాడి రెడ్డిబాబు, ఎం. నారాయణరాజు, కూర్మరాజు, ఎం. మత్స్యరాజు, ఎం. సింహచలంరాజు, ఎం. మత్స్యరాజు (మాస్టర్‌), కిముడు వెంకటరమణ, గౌరవ అధ్యక్షులుగా మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు, ఎం. మణికుమారి, జెడ్పీటీసీ డాక్టర్‌ మత్స్యరాస వెంకటలక్ష్మి, మాజీ ఎంపీపీ మత్స్యరాస వరహాలమ్మ, హెచ్‌ఎం మత్స్యరాస వరహారాజు, ఎంపీటీసీ ఎం. విజయకుమారి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా మత్స్యరాస వెంకటగంగరాజు (బుజ్జి), సర్పంచ్‌ కిముడు రాంబాబు, ఎం. సత్యనారాయణరాజు, ఎం. రామచంద్రరాజు, సహాయ కార్యదర్శులుగా ఎస్‌.కె. రెహ్మాన్‌, సత్తిబాబు, రాము, బ్రహ్మాజీ, శ్రీను, గంగాధర్‌, వరహాలుదొర, ఎం. నాగరాజు, మైనారావు, కోశాధికారిగా ఎస్‌కే అమీర్‌, సహాయ కోశాధికారిగా అచ్చుతరావు, ఆర్గనైజింగ్‌ సభ్యులుగా బి. అరుణ్‌కుమార్‌, టి. సత్యనారాయణ, సిహెచ్‌. వెంకటరమణ, వి. శ్రీను, జి. గణేష్‌, సీహెచ్‌. శేఖర్‌ను నియమించారు. వీరితో పాటు కొంతమందిని కమిటీ సభ్యులుగా నియమించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను విజయవంతానికి సహకరించాలని కోరారు.

ఏర్పాటైన ఉత్సవ కమిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement