రోడ్డు ప్రమాదంలోయువకుడు మృతి
ఎస్.రాయవరం : పెనుగొల్లు సమీపంలో గుర్తు తెలియని వాహ నం ఢీకొని యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మేరకు ఎస్‌ఐ విభీషణరావు బుధవారం అందించిన వివరాలిలా ఉన్నాయి. లింగరాజుపాలెం గ్రామానికి చెందిన ఏడిద దిలీప్‌కుమార్ స్నేహితులు నలమాటి జగన్, ఎస్.రాయవరానికి చెందిన జితేంద్ర మగళవారం అర్ధరాత్రి పెనుగొల్లు సమీపంలో భోజనం చేసేందుకు హోటల్‌కి వెళ్లారు. అర్థరాత్రి కావడం హోటల్ మూసి వేయడంతో పెనుగొల్లు జాతీయ రహదారిపై యూ టర్న్ తీసుకుంటుండగా అనకాపల్లి నుంచి తుని వైపు వెళుతున్న వాహనం ఢీకొట్టడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనం సహాయం అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దిలీప్‌కుమార్(20) మృతి చెందాడు. గాయపడ్డ జగన్, జితేంద్రలను మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కి తరలించినట్టు చెప్పారు.


