500 కిలోల రేషన్ బియ్యం పట్టివేత
రోలుగుంట : కె.నాయుడుపాలెం గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో తహసీల్దార్ సిహెచ్.నాగమ్మ సిబ్బందితో కలసి బుధవారం దాడి చేశారు. కె.నాయుడుపాలెం వైఎస్సార్ విగ్రహం కూడలిలో రేషన్ బియ్యంతో నింపి ఉన్న పది బస్తాలలో 500 కిలోల బియ్యం తరలించడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ దాడి సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడం, కొంత సేపు వేచి ఉన్నా ఎవరూ రాకపోవడంతో తహసీల్దార్ బస్తాలలో ఉన్న బియ్యం పరిశీలించి రేషన్ బియ్యంగా గుర్తించి వాటిని పౌర సరఫరా సరకులు గోదాములకు ఆర్‌ఐ రామ్మూర్తితో చేరవేసి తాను తన కార్యాలయానికి తహసీల్దార్ వెనుదిరిగారు. సాయంత్రం ఇదే మండలం రత్నంపేట గ్రామానికి చెందిన పెనుగొండ జగన్నాథం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి బియ్యం తనవేనని, ఇప్పించాలని కోరాడు. దీనిపై తహసీల్దార్ అతనిని విచారించి సరైన సమాధానం లేకపొవడంతో ఎస్‌ఐకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై రామకృష్ణారావు కేసు నమోదు చేశారు.


