జాతీయ స్థాయి పోటీలకు గిరిజన క్రీడాకారులు
పాడేరు రూరల్: జాతీయ స్థాయి పీసా క్రీడా పోటీలకు అరకు, పాడేరుకు చెందిన విద్యార్థులు ఎంపిక అవడం అభినందనీయమని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జగన్‌మోహన్‌రావు బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీల్లో ఆయా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభకనబర్చి జాతీయ పోటీలకు ఎంపికై నట్టు చెప్పారు. ఇందులో భాగంగా మారథాన్ విభాగంలో అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పి.శివాజీ, పాడేరు డిగ్రీ కళాశాల నుంచి డి.ఆనందరాజు, అరకులోయ మహిళ డిగ్రీ కళాశాల నుంచి పి.నీలవేణి, ఎస్.మంజుల, ఎల్.జ్యోతి, బాలుర కబడ్డీ టీమ్‌కు ఎం.కార్తిక్, జి.లోకనాథ్, పి.హేజెకియా, యు.అనీల్, కె.గణేష్, కె.చంద్రుబాబు, పి.మల్లికార్జున్, బాలికల కబడ్డీ టీమ్‌కు పాడేరు, అరకులోయ మహిళ డిగ్రీ కళాశాలలకు చెందిన ఎస్.మంజుల, కె.అనిత, పి.నీలవేణి, పి.జ్యోతి, కె.ఝాన్సీ ఎంపికయ్యారు. ఆయా క్రీడాకారులను బుధవారం పలువురు అభినందించారు. విశాఖలో ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించిన జాతీయ స్థాయి పీసా క్రీడా పోటీల్లో వారు పాల్గొననున్నారు.


