రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Dec 11 2025 8:10 AM | Updated on Dec 11 2025 8:10 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

కొయ్యూరు: పెదమాకవరం పంచాయతీ రామరాజుపాలెం వంతెన వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కంపరేగులకు చెందిన పనసలరాజు, సత్తిబాబు, రామరాజుపాలెనికి చెందిన లోతా రాజుబాబు బైక్‌పై నడింపాలెం వెళ్తున్నారు. ఆ సమయంలో రామరాజుపాలెం వంతెన వద్ద వాహనం అదుపుతప్పడంతో డివైడర్‌ను బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు కు బలమైన గాయాలయ్యా యి. అతడిని కొయ్యూరు ఎస్‌ ఐ కిశోర్‌వర్మ 108లో కృష్ణదేవిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సత్తిబాబు, రాజుబాబుకు స్వల్పగాయాలయ్యాయి. వారిని కృష్ణాదేవిపేట ఆస్పత్రి లో వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కిశోర్‌వర్మ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు 1
1/1

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement