పోస్టల్ బీమాతో ఆర్థిక భరోసా
ముంచంగిపుట్టు: తక్కువ ప్రీమియంతో అధిక బోనస్ వచ్చే పోస్టల్ బీమాలు చేసుకొని కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని అరకు సబ్ డివిజన్ పోస్టల్ ఐపీవో లక్ష్మీకిషోర్ అన్నారు. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల పోస్టల్ బీపీఎంలు, ఏబీపీఎంలతో బుధవారం ఐపీవో సమావేశం నిర్వహించారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరిగే పోస్టల్ జీవిత బీమాలపై గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని పోస్టల్ ఉద్యోగులకు సూచించారు. ఐపీపీబీ గ్యాగ్ పాలసీలు చేయడంతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురుకు సర్టిఫికెట్లు అందించి, అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఐపీవో లక్ష్మీకిషోర్ మాట్లాడుతూ పోస్టల్ బీమాల ప్రయోజనాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఆర్‌పీఎల్‌ఐ, పీఎల్‌ఐలపై తెలియజేసి, అధిక బీమాలు తెరిచి, అరకు సబ్ డివిజన్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఎంవో శ్రీను, ఎస్‌పీఎం రాజు, బీపీఎంలు, ఏబీపీఎంలు పాల్గొన్నారు.


