ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక చర్యలు
ఎటపాక: గోదావరి నుంచి రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు స్పందించారు. రాత్రి సమయాల్లో ఇసుక అక్రమ రవాణాపై నిశీది వేళ నిర్భయంగా అనే కథనం బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన తహసీల్దార్ శ్రీనివాసరావు ఆదేశాలతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సందీప్, వీఆర్వో రామ్మూర్తి ఎటపాక వద్ద గోదావరి తీరం ఇసుక అక్రమ రవాణాకు ఏర్పాటు చేసిన ర్యాంపులను పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు ట్రాక్టర్లు వెళ్లకుండా పొక్లెయన్‌లు, ఇతర వాహనాలు వెళ్లకుండా రహదారికి అడ్డంగా కందకాలు తవ్వించారు. రెవెన్యూ అధికారుల స్పందనపై వైఎస్సార్‌సీపీ నాయకులు కురినాల వెంకట్, విజయ్‌కుమార్ ,నరేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక చర్యలు


