ఉత్తమ మహిళా రైతుగా అడపా లక్ష్మి
గూడెంకొత్తవీధి: గూడెంకొత్తవీధి మండలం జర్రెల పంచాయతీ నిట్టమామిడిపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళా రైతు అడపా లక్ష్మికి అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీ కేంద్రంగా అగ్రికల్చర్ టుడే మేగజైన్ జాతీయ వ్యవసాయ పత్రిక 2025 ఏడాదికి సంబంధించి ఉత్తమ మహిళా రైతుగా ఎంపిక చేస్తూ అవార్డుకు ఎంపిక చేసింది. అడపా లక్ష్మి ఎం.ఏ బీఈడీ చేశారు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఈమె కొంతకాలంగా సేంద్రియ వ్యవసాయాన్ని చేపడుతున్నారు. కాఫీతోపాటు అంతర పంటలుగా మిరియాలు కమలా, అరటి తోటలు, కాయగూరలు వంటివి పండిస్తున్నారు. ఉన్నత చదువులు అభ్యసించి వ్యవసాయంలో రాణిస్తున్న ఈమెను జాతీయ వ్యవసాయ పత్రిక గుర్తించి అవార్డుకు ఎంపిక చేసింది.


