జాతీయ మారథాన్ పోటీలకు గిరిజనుడు ఎంపిక
ముంచంగిపుట్టు: మారథాన్ రన్ జాతీయస్థాయి పోటీలకు మండలంలోని పెదగూడ పంచాయతీ జర్రిపడ గ్రామానికి చెందిన గిరిజనుడు కుర్తాడి ప్రసాద్ ఎంపికయ్యారు. విశాఖలోని కొమ్మదిలో ఈనెల 10న ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రీడా మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంద్రప్రదేశ్ ఆధ్వర్యంలో పీసా రాష్ట్రస్థాయి పోటీల్లో 10 కిలోమీటర్ల మారథాన్ నిర్వహించారు.ఈ పోటీల్లో పాల్గొన్న ప్రసాద్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో ఈ నెల 22 నుంచి 24 వరకు విశాఖలో జరిగే జాతీయ స్థాయి మారథాన్ రన్ పోటీలకు ప్రసాద్ ఎంపికై య్యారు. గిరిజనుడు ప్రసాద్ అనకాపల్లి జిల్లా నర్సింగరావుపేట లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, జర్రిపడ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలియజేశారు.


