పెండింగ్ కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు చేయాలి
జి.మాడుగుల: పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని పాడేరు సబ్ డివిజనల్ పోలీసు అధికారి(డిఎస్పీ)షహబాజ్ అహ్మద్ ఆదేశించారు. మండల కేంద్రంలో గల పోలీస స్టేషన్, సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని, వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఆయన సందర్శించారు. పోలీస్ స్టేషన్లలో వివిధ విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్‌లో నమోదైన వివిధ కేసులను దర్యాప్తు పురోగతిపై ఆయన ఆరా తీసి పెండింగ్‌లో ఉన్న కేసులు దర్యాప్తు పూర్తి చేయాలని తెలిపారు. స్టేషన్లలో రికార్డులను సమగ్రంగా పరిశీలించారు.స్టేషన్ ఇన్‌చార్జీ, పోలీస్ సిబ్బందితో విస్తృతంగా చర్చించి ప్రజలకు వెంటనే న్యాయం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. పోలీస్ సిబ్బంది పనితీరును మరింత మెరుగుపర్చడానికి అవసరమైన మార్గదర్శకాలను తెలియజేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ షణ్ముఖరావు, స్టేషన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


