రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
గంగవరం : మండలంలోని పాతరామవరం గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై ధాన్యం ఆరబోయడంతో బైక్ అదుపు తప్పి కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పారావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్తపల్లికి చెందిన అప్పారావు బైక్‌పై కొత్తపల్లి వైపు వెళ్తుడంగా రోడ్డుపై వేసిన ధాన్యం కారణంగా బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైయ్యాడు. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టడాన్ని నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు. గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రోడ్డుపై ధాన్యం రాసులు వేసే రైతులకు ఎస్‌ఐ వెంకటేష్ కౌన్సెలింగ్ ఇచ్చారు.


