ఐటీడీఏ పీవోకు వినతి
రంపచోడవరం: సమగ్ర శిక్ష అభియాన్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమం రంపచోడవరం ఐటీడీఏ ఆధ్వర్యంలో విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొళ్ల బొజ్జిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, మెంబరు గొర్లె సునీతలు ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్‌ను కలిసి కోరారు. ఎస్టీ కమీషన్ చైర్మన్ మాట్లాడుతూ రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే విధంగా కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఎస్‌ఎస్‌ఏను అమలు చేసిందన్నారు. 2001సంవత్సరంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎస్‌ఎస్‌ఏ పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నెల 18న సిల్వర్ జూబ్లీ కార్యక్రమం రంపచోడవరంలో ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.డీఎన్ మూర్తి, మళ్లీరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఫణింద్రలు పాల్గొన్నారు. ఎస్టీ కమీషన్ చైర్మన్ వివిధ సమస్యలు పరిష్కరించాలని పీవోకు తెలిపారు.


