అల్లూరి జిల్లా: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోడురులో మొబైల్ ఫోన్ లాక్కున్నాడన్న కోపంతో భర్తను ఓ మహిళ గొడ్డలితో నరికి హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మేడూరులో కొర్రా రాజారావు భార్య కాకర దేవి, ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. భార్య తరచూ ఎక్కువసేపు ఫోన్ లో మాట్లాడుతుండటంతో రాజారావుకు అనుమానం వచ్చింది. దీనిపై అనే కసార్లు ఆమెను మందలించాడు. అయినా భార్య అతని మాటలు వినలేదు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పిల్లలను పట్టించుకోకుండా ఎక్కువ సేపు భార్య ఫోన్ మాట్లాడడాన్ని రాజారావు గమనించాడు.
భార్యను మందలించి ఫోన్ లాక్కున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న భార్య అతను నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో మెడపై నరికింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు రాజారా వును నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. పోలీసులకు రాజారావు పిల్లలు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నవరం పోలీసులు తెలిపారు. ఇలావుండగా భార్యాభర్తల మధ్య నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నట్టు సమాచారం.


