జైస్వాల్ జోరు..
రో–కో హుషారు..
విశాఖ అంటేనే టీమిండియాకు ‘అచ్చొచ్చిన కోట’అని మరోసారి రుజువైంది. సముద్ర ఘోషను మించిన అభిమానుల హర్షధ్వానాలు.. స్టేడియం నలువైపులా మార్మోగిన ‘రో–కో’నినాదాల నడుమ భారత జట్టు కదంతొక్కింది. సిరీస్ విజేతను తేల్చే మ్యాచ్‌లో సమష్టి కృషితో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో.. ప్రతికూల పరిస్థితుల్లో బౌలర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పగా, యశస్వి జైస్వాల్ తన తొలి శతకంతో వీరవిహారం చేశాడు. కిక్కిరిసిన స్టేడియంలో కోహ్లీ తనదైన క్లాసిక్ ఫినిషింగ్ ఇవ్వడంతో.. సిరీస్ భారత్ వశమైంది. కోహ్లీ, రోహిత్‌లపై అభిమానం చాటుతూ ఫ్యాన్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. బౌలర్ల సమయస్ఫూర్తి, బ్యాటర్ల దూకుడుతో విశాఖ వాసులకు పసందైన క్రికెట్ విందు లభించింది.
– విశాఖ స్పోర్ట్స్
కుల్దీప్‌ను అభినందిస్తున్న
కోహ్లీ, రాహుల్


