కృత్రిమ మేధస్సుపై వర్క్‌షాప్
మాట్లాడుతున్న పాడేరు కళాశాల ప్రిన్సిపాల్ చిట్టబ్బాయి
కొయ్యూరు: కృత్రిమ మేధస్సు(ఏఐ), పైథాన్‌పై మర్రిపాలెం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాప్‌లో మొదటి రోజు పాడేరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వి.చిట్టబ్బాయి మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు వల్ల కలిగే లాభాలను వివరించారు. ఏఐని నేర్చుకోవడం ద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలను పొందవచ్చని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుధ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఏఐని నేర్చుకోవాలన్నారు. వెబ్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్‌పై కోఆర్డినేటర్ డాక్టర్ డి.రాజుబాలు, అధ్యాపకులు చంద్ర శేఖర్, ట్రైనర్ కార్తీక్ రెడ్డి విద్యార్థులకు అవగాహన కల్పించారు.


