పాడేరు : ప్రజా శ్రేయస్సు కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేదలకు తీరని నష్టం జరుగుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. మండలంలోని గబ్బంగి పంచాయతీ పనసపల్లిలో సోమవారం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గిరిజ నులు స్వచ్ఛందంగా తరలివచ్చి, ప్రైవేటీకరణను వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ, వారి తరఫున ఉద్యమాలు చేస్తోందని చెప్పారు. ఈనెల 12న పాడేరులో నిర్వహించే ర్యాలీ, నిరసన కార్యక్రమానికి అధిక సంఖ్య లో పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను తమ వారికి కట్టబెట్టేందుకే చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణను పూనుకుంటోందని తెలిపారు. ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలన్నారు. అనంతరం అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు చెట్టి పాల్గుణ, వైఎస్సార్‌సీపీ మహిళ విభాగం జోన్–1 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, పార్టీ మండల అధ్యక్షులు సీదరి రాంబాబు, నుర్మానీ మత్స్యకొండం నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, జిల్లా ఉపాధ్యక్షుడు గంపరాయి దిలీప్‌కుమార్, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, సర్పంచ్ గొల్లోరి నీలకంఠం, ఎంపీటీసీ దూసూరి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదంలో వైద్య రంగం
ముంచంగిపుట్టు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంతో వైద్య రంగం ప్రమాదంలో పడుతుందని అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి అన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ముంచంగిపుట్టులో అంబేడ్కర్ పార్కు నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ మాట్లాడుతూ వైద్యకళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్యం దూరమవుతుందని చెప్పారు. కోటి సంతకాల సేకరణకు గ్రామాల్లో సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. తక్షణమే ప్రైవేటీకరణ నిర్ణయా న్ని వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎంపీపీ అరిసెల సీతమ్మ, వైస్‌ఎంపీపీ భాగ్యవతి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రమేష్, అసెంబ్లీ గ్రీవెన్స్ అధ్యక్షుడు సందడి కొండబాబు, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు పాల్గొన్నారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో తీరని నష్టం


