పకడ్బందీగా పది పరీక్షలు
కొయ్యూరు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని పరీక్షల సహాయ కమిషనర్ శశికుమార్ తెలిపారు. స్థానిక ప్రభుత్వోన్నత, గురుకుల, బాలుర పాఠశాలలను ఆయన సోమవారం సందర్శించారు. పరీక్షలు జరిగే గదులను పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. దీనిలో భాగంగా పాఠశాలలను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రణాళికతో చదివి మంచి మార్కులు సాధించాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఎంఈవో–2 ప్రసాద్, ప్రభుత్వ పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం గాంధీ ఉన్నారు.
రాజవొమ్మంగి: మండలంలో టెన్త్ పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన పది పాఠశాలలను జిల్లా అసిస్టెంట్ కమిషనర్ (ఎగ్జామ్స్) శశికుమార్ సోమవారం సందర్శించారు. అక్కడ మౌలిక సదుపాయాలను పరిశీలించారు. హెచ్‌ఎంలకు పలు సూచనలు చేశారు. టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఎంఈవో–2 సూరయ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా పది పరీక్షలు


