బ్రౌన్ జీవితం ఆదర్శనీయం
సీపీ బ్రౌన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్, అధికారులు
పాడేరు : తెలుగు భాష, సాహిత్య అభివృద్ధికి విశేష కృషి చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతిని సోమవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈస్ట్ ఇండియా కంపెనీలో అధికారిగా పనిచేస్తూనే తెలుగు భాషాభివృద్ధికి బ్రౌన్ ఎనలేని సేవ చేశారన్నారు. తెలుగు ప్రజలంతా ఆయన జయంతి రోజున తెలుగులో సంతకం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మలత, చీఫ్ ప్లానింగ్ అధికారి ఎల్. లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


