ఏయూను సందర్శించిన ఐఐజీ డైరెక్టర్
మద్దిలపాలెం(విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సోమవారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియో మేగ్నటిజం(ఐఐజీ) సంస్థ సంచాలకుడు ఆచార్య ఎ.పి.డిమ్రి సందర్శించారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్‌తో కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏయూ శతాబ్ది ఉత్సవాలు, వర్సిటీలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వీసీ వివరించారు. గతంలో ఏయూతో ఐఐజీ మధ్య జరిగిన అవగాహన ఒప్పందం(ఎంవోయూ) పునరుద్ధరించడం, కార్య రూపంలో చూపడంపై విస్తృతంగా చర్చించారు. రెండు విద్యా సంస్థలు సంయుక్తంగా కలిసి పనిచేసే అంశాలపై పరస్పరం తమ ఆలోచనలను పంచుకున్నారు. అనంతరం ఏయూ తరఫున ఆచార్య డిమ్రిని సత్కరించి, జ్ఞాపిక బహూకరించారు.


