
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
పాడేరు : ఇటీవల పాడేరు మండలం చింతలవీధిలో వినాయక నిమజ్జనంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతుల కుటుంబాలకు రాష్ట్ర గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఆర్థికసాయాన్ని బుధవారం ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అందజేశారు. నిమజ్జన ఊరేగింపులో ఓ వాహనం ఢీకొట్టడంతో కొర్రా సీతారం, గుంట కొండబాబు, వంతాల దాలిమ్మలు మృతి చెందడం తెలిసిందే. దీనిపై స్పందించిన రాష్ట్ర గణేష్ ఉత్సవ కమిటీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు నరేంద్రనాథ్ చౌదరి, ఏఎస్సార్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామయ్య, అప్పారావు, బాబూరావు తదితరులు ఒక్కోక్క కుటుంబానికి రూ.50వేల చొప్పున సమకూర్చారు. ఈ నగదును బుదవారం ఐటీడీఏ పీవో చేతుల మీదుగా పంపిణీ చేశారు.