
రంపచోడవరంలో ఆదికర్మయోగి సేవా కేంద్రం
● ప్రారంభించిన ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్
రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆదికర్మయోగి సేవా కేంద్రాన్ని పీవో స్మరణ్‌రాజ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గ్రామాలకు సంబంధించిన సమస్యలు తెలుసుకొనేందుకు కేంద్రప్రభుత్వం ఈ సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో ఎంపిక చేసిన 204 ఆదికర్మయోగి సేవా కేంద్రాల్లో సమస్యలను ఇక్కడ ఏర్పాటు చేసిన సేవా కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. యాక్షన్ ప్లాన్ ఎప్పటికప్పుడు ఆప్‌లోడ్ చేసేలా ఆన్‌లైన్ సౌకర్యం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డీఎన్‌వీ రమణ, ఐటీడీఏ మేనేజర్ బి. రాజు పాల్గొన్నారు.