
భారీగా ఒడిశా మద్యం పట్టివేత
ముంచంగిపుట్టు: అక్రమంగా తరలిస్తున్న ఒడిశా మద్యాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్‌లో కిరాణా సామాన్ల మధ్యలో మద్యం బాక్సులు ఎక్కించి తరలిస్తుండగా బుంగాపుట్టు పంచాయతీ గర్రం ఘాట్‌లో గురువారం సాయంత్రం వాహనాల తనిఖీలో భాగంగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న 90 బాక్సుల మద్యం సీసాలను స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. మద్యం తరలింపునకు ఉపయోగించిన వ్యాన్ జోలాపుట్టులోని కిరాణా వ్యాపారికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఎస్‌ఐ రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా ఒడిశా మద్యాన్ని, వ్యాన్‌ను స్వాధీనం చేసుకోవడం వాస్తవమేనన్నారు. విచారణలో ఉన్నందును పూర్తి వివరాలు శుక్రవారం వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
90 బాక్సులు స్వాధీనం

భారీగా ఒడిశా మద్యం పట్టివేత