
అభివృద్ధికి వెనుకబడిన గ్రామాల ఎంపిక
కూనవరం: అభివృద్ధి చేసేందుకు వెనుకబడిన గిరిజన గ్రామాలను ఎంపిక చేయాలని మినిస్ట్రీ ఆప్ ట్రైబల్ వెల్ఫేర్ ప్రత్యేక అధికారి(ఢిల్లీ) సబ్నాం సూచించారు. ఆది కర్మయోగి అభియాన్‌లో భాగంగా మండల పరిధిలోని చినార్కూరు గ్రామాన్ని బ్లాక్ లెవెల్ బృందాలు గురువారం సందర్శించాయి. గ్రామాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయడంపై చర్చించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సబ్నాం మాట్లాడుతూ బృందాలు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ల కొరకు గ్రామ వర్క్‌బుక్, కమ్యూనిటీ భాగస్వామ్యం తో గ్రామాల్లో విజన్ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. చింతూరు ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావు, ఎంపీడీవో ఎంవీఎస్ జగన్నాథరావు, పెసా కార్యదర్శి కుంజా అనిల్ తదితరులు పాల్గొన్నారు.