
దసరా వేడుకలకుముహూర్తపు రాట
సీలేరు: దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వర్తకులు సిద్ధమవుతున్నారు. దారకొండ పంచాయతీలో దసరా ఉత్సవాలకు ముహూర్తపు రాట కార్యక్రమాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. గ్రామ పెద్దలు సరస్వతి రావు, రామయ్య, వరప్రసాద్, బర్సయ్య, తిరుమలేష్. తదితరులు పాల్గొన్నారు. దుర్గాదేవి నవరాత్రుల వేడకల్లో భాగంగా సీలేరులో పలువురు భక్తులు భవానీ మాలధారణ చేపట్టారు. సుమారు 25 మంది అమ్మవారి దీక్షను ప్రారంభించారు. గురుభవానీలు సన్యాసిరావు, శ్రీను, రాముల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

దసరా వేడుకలకుముహూర్తపు రాట