
విద్యా ప్రగతిని పెంచేందుకు నాణ్యమైన బోధన
చింతపల్లి: విద్యార్దులకు విద్యాప్రగతిని పెంచే విధంగా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యాబోధన చేయాలని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ వి.రామస్వామినాయుడు అన్నారు. తాజంగి కస్తూర్బా పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రగతిని అంచనా వేసేందుకు ఎఫ్‌ఎ బుక్‌లెట్‌లను సమీక్షించారు. బోధనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాద్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థి సామార్థ్యానికి తగ్గట్టుగా అభ్యసించేలా తరగతులను నిబద్దతో నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో భోజన సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల సిబ్బందితో సమావేశమై విద్యార్థుల విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ వంటి అంశాలను చర్చించారు. ప్రిన్సిపాల్ మాధురి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.