
చింతపల్లి జెడ్పీటీసీకి పరామర్శ
కొయ్యూరు: కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చింతపల్లి జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్యను ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎంపీ గొడ్టేటి మాధవి, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జీసీసీ మాజీ చైర్‌పర్సన్ స్వాతిరాణి మంగళవారం పరామర్శించారు. మండలంలోని మంప పంచాయతీ గంగవరంలో ఉంటున్న బాలయ్యను వారు బుధవారం పరామర్శించి యోగక్షేమాలు తెలసుకున్నారు. విశ్రాంతి తీసుకోవాలని, ఎలాంటి ఒత్తిడికి లోనుకావద్దని కోరారు. ఆరోగ్య భద్రత పాటించాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీసీ కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ గాడి నాగమణిని కంఠారంలో పరామర్శించారు. ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు, వైస్ ఎంపీపీ అంబటి నూకాలు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బి.అప్పారావు, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రేగటి ముసిలినాయుడు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు జల్లి బాబులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.