
పోలీసుల శ్రమదానం
● గోతులను పూడ్చిన పోలీసు సిబ్బంది
హుకుంపేట: రోడ్డు ప్రమాదాల నివారించేందుకు పోలీసులు తమ వంతు సాయంగా ముందుకొచ్చారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న గోతులను పూడ్చే కార్యక్రమాన్ని పోలీసు సిబ్బంది చేపట్టారు. ఈ సంద్భంగా సీఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ మండలంలోని రహదారులు గోతులు ఏర్పడటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకు తమ సిబ్బందితో గుంతల పూడ్చే పనులు చేయించినట్టు చెప్పారు. వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో శ్రమదానంతో గుంతలు పూడ్చడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఎస్‌ఐ సూర్యనారయణ, సర్పంచ్ సమిడ వెంకటపూర్ణిమ, సిబ్బంది రెడ్డి తదితరులు పాల్గొన్నారు.