
విశ్వకర్మ చరిత్రపై అవగాహన అవసరం
రంపచోడవరం: హిందూ పురాణాల ప్రకారం ద్వారకామయిను ఏర్పాటు చేసినటువంటి విశ్వకర్మ చరిత్రను తెలుసుకోవాలని ఐటీడీఏ ఏపీవో డీఎన్‌వీ రమణ అన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీవో, డీడీ రుక్మాండయ్య, ఈఈ ఐ శ్రీనువాస్‌రావు తదితరులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతి గ్రామంలో ప్రతీ మహిళ ఆరోగ్యకరంగా ఉండే విధంగా వైద్య సేవలందించడం జరుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ జెడీ డాక్టర్ జనార్ధన్ అన్నారు. బుధవారం ఐటీడీఏ సమావేశపు హాలులో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీఎం మోదీ ప్రసంగాన్ని టెలికాస్ట్ ద్వారా అధికారులు,మహిళలు తిలకించారు. జెడీ జనార్ధన్ మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించి, వైద్యపరీక్షలు చేస్తున్నామన్నారు. క్షయ వ్యాధి, సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధికి స్క్రీనింగ్ చికిత్సపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఏడీఎంహెచ్‌వో డాక్టర్ డేవిడ్, వైద్యులు పాల్గొన్నారు.