
అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు
రంపచోడవరం: గంగవరం మండలంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు రంపచోడవరం ఎకై ్సజ్ సీఐ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎకై ్సజ్ శాఖ చేపట్టిన దాడుల వివరాలు తెలియజేశారు. గంగవరం గ్రామంలో 10 మద్యం సీసాలతో వీర వెంకట సత్యనారాయణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. అనంతరం ఏఈఎస్‌టీఎఫ్ టీమ్ జరిపిన దాడుల్లో కొత్తాడ గ్రామంలో ఏడు మద్యం సీసాలతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ నెలలో రంపచోడవరం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 13 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి 13 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 96 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో అక్రమంగా మద్యం విక్రయించినా, బెల్ట్ షాపులు నిర్వహించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా వివిధ నాటుసారా కేసుల్లో నిందితులుగా ఉన్న ఎనిమిది మందిని రిమాండ్‌కు తరలించామన్నారు.