
లభ్యంకాని మత్స్యకారుడి ఆచూకీ
ముంచంగిపుట్టు: మండలంలోని వనుగుమ్మ పంచాయతీ దొమినిపుట్టు సమీపంలోని మత్స్యగెడ్డలో గల్లంతైన గిరిజన మత్స్యకారుడు కిల్లో నర్సింగ్(28) ఆచూకీ వారం రోజులైనా లభ్యం కాలేదు. విశాఖపట్నం నుంచి వచ్చిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రెండు రోజలుగా గాలింపులు చేస్తున్నాయి. వీరికి స్థానిక రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, పరిసరాల గ్రామాల గిరిజనులు పూర్తి సహకారం అందిస్తున్నారు. దొమినిపుట్టు నుంచి కోసంపుట్టు, పట్నపడాల్‌పుట్టు వరకు సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా గాలింపు చేపట్టారు. మంగళవారం కూడా గాలించినా ఫలితం లేకపోయింది. ఇలాఉండగా మత్స్యగెడ్డ పరివాహక గ్రామాల గిరిజన మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు డిమాండ్ చేశారు.దొమినిపుట్టు గ్రామ సమీపంలో మత్స్యగెడ్డలో జరుగుతున్న గాలింపులను మండల వైఎస్సార్‌సీపీ నేతలు పరిశీలించారు.బాధిత కుటుంబానికి తమ పార్టీ నుంచి పూర్తి సహకారం అందిస్తామని వారు తెలిపారు. జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, సర్పంచ్ నీలకంఠం, వైఎస్సార్‌సీపీ మండల ప్రధాన కార్యదర్శి సన్యాసిరావు, మండల నేతలు జేవీవీఎన్ మూర్తి, సాధురాం, దేవా, భగత్‌రాం, చందు, రామరాజు పాల్గొన్నారు.
మత్స్యగెడ్డలో గల్లంతైన నర్సింగ్ కోసం
వారం రోజులుగా గాలింపు

లభ్యంకాని మత్స్యకారుడి ఆచూకీ