
పైసా వసూల్
అటవీ శాఖ..
మారేడుమిల్లి,
తులసిపాకలులో
ఫారెస్ట్ చెక్ పోస్టుల ఏర్పాటు
వాహనాలు,
పర్యాటకుల
నుంచి
ఇష్టానుసారంగా డబ్బుల వసూళ్లు
చార్జీల వసూలు
తగదంటున్న
పర్యాటకులు
రంపచోడవరం: పర్యావరణ పరిరక్షణ, ఆహ్లాదం మాటున అడ్డగోలు నిబంధనలతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మరీ వాహనచోదకులు, పర్యాటకుల నుంచి అటవీశాఖ రుసుం వసూలు చేస్తోంది. ఏజెన్సీ అందాలు చూసేందుకు వచ్చిన సందర్శకుల నుంచి నాలుగు నెలలుగా అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు స్థానిక గిరిజనులు, పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను వదలిపెడుతున్నారని, వాటిని తొలగించడం కోసమే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, డబ్బులు వసూలు చేస్తున్నామని అటవీ అధికారులు చెబుతున్నారు.
ద్విచక్ర వాహనాల నుంచీ రుసుం వసూలు
పాపికొండలు అభయారణ్యం పరిధిలో ఎన్విరాన్‌మెంట్ మెంటైనెన్స్ చార్జీలుకు అటవీ శాఖ అధికారులు మారేడుమిల్లి, తులసిపాకలు వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఏజెన్సీలో ప్రవేశించిన వారి నుంచి ఈ చెక్‌పోస్టుల ద్వారా నగదు వసూలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాల నుంచి రూ.20, భారీ వాహనాల నుంచి రూ.100, అతి భారీ వాహనాల నుంచి రూ.150 వసూలు చేస్తున్నారు. అలాగే పర్యాటకులు డిజిటల్, ప్రొఫెషనల్ కెమెరాలు వెంట తీసుకువెళితే రూ.500 చెల్లించాలి, ఎన్విరాన్‌మెంట్ మెంటైనెన్స్ చార్జీ జరిమానా కింద రూ.500 వసూలు చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు తమకు నచ్చిన విధంగా చార్జీలు నిర్ణయించారని, ఏజెన్సీ ప్రాంతం నుంచి వెళ్లేందుకు మేం ఎందుకు డబ్బులు కట్టాలని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా మారేడుమిల్లి ఏజెన్సీలో అటవీశాఖ అధికారులు ఇలాంటి నిబంధనలు పెట్టడం తగదంటున్నారు.
అన్నింటికీ అధిక ధరలు
మారేడుమిల్లిలో అన్ని వస్తువులు బయట ప్రాంతం కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.వాటర్ బాటిళ్లు, సిగరెట్లు తదితర వస్తువులపై అదనంగా రూ.5 వసూలు చేస్తున్నారు.ఇక పర్యాటక అతిథి గృహాలకు డిమాండ్‌ను బట్టి ధరలను నిర్ణయించి, సందర్శకులను అడ్డుగోలుగా దోచుకుంటున్నారని పర్యాటకులు వాపోతున్నారు. అటవీ శాఖ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం పేరుతో పర్యాటక అతిథి గృహాలను నిర్వహిస్తోంది. అయితే ఎంతో కాలంగా సీబీఈటీలో అడిట్ నిర్వహించలేదు. వచ్చిన డబ్బులు దేనికి ఖర్చు చేస్తున్నారు, పర్యాటక అభివృద్ధికి ఏం చేస్తున్నారు వంటి వివరాలు అటవీ శాఖ వద్ద లేవు. పర్యాటకుల నుంచి వివిధ చార్జీలు, సౌకర్యాల కల్పన రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న అటవీ శాఖ ఏజెన్సీ ప్రాంభం నుంచి మారేడుమిల్లి వరకు మహిళల కోసం పబ్లిక్ మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. గుడిసెకు వెళ్లే పర్యాటకుల నుంచి వసూలు చేసిన డబ్బులకు ఇప్పటికీ లెక్కాపత్రం లేదనే విమర్శలు ఉన్నాయి.
డబ్బుల వసూలు అన్యాయం
ఏజెన్సీప్రాంతానికి వచ్చిన పర్యాటకుల నుంచి ఎడపెడా డబ్బులు వసూలు చేస్తున్నారు. చెక్‌పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేయడం అన్యాయం. గుడిసె సందర్శ కులు, అతిథి గృహాల ద్వారా వచ్చిన డబ్బులకు నేటికీ సరైన లెక్కలు లేవు.పబ్లిక్ అడిట్ పెట్టి లెక్కలు తేల్చాలి. అటవీ శాఖ నిర్వహిస్తున్న అతిథి గృహాలను తక్కు వ ధరకు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలి.
– దూడ స్మిత్, మారేడుమిల్లి
ప్లాస్టిక్ ఏరివేతకుఉపయోగిస్తున్నాం
పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ సీసాలు, కవర్లు ఏరివేసేందుకు చెక్‌పోస్టులు ద్వారా వచ్చిన డబ్బులు వినియోగిస్తున్నాం.సేకరించిన ప్లాస్టిక్‌ను రంపచోడవరంలోని ప్లాస్టిక్ కోనుగోలు చేసే వారికి పంపుతున్నాం.
– ఏడుకొండలు,
రేంజర్, మారేడుమిల్లి

పైసా వసూల్

పైసా వసూల్