నేటి నుంచి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స
మురళీనగర్ (విశాఖ): కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విశాఖ ప్రాంతీయ స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణ తెలిపారు. ఈ పోటీల్లో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని చెప్పారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు సిద్ధం చేశామన్నారు. కాగా.. ఇండోర్ గేమ్స్(టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్)ను గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తామని తెలిపారు. బాలబాలికలకు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, బాలికల విభాగంలో చెస్, ఖోఖో, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, బాలుర విభాగంలో కబడ్డీ, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్ తదితర పోటీలు ఫిజికల్ డైరెక్టర్ అబ్బాస్ బేగ్ పర్యవేక్షణలో జరుగుతాయని వివరించారు.


