అప్పన్నకు కూరగాయల వితరణ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటకు చెందిన కె.కనకమహాలక్ష్మి కూరగాయలు వితరణగా అందజేశారు. 500 కిలోల గుమ్మడి కాయలు, 200 కిలోల చింతకాయలు, 200 కిలోల క్యాబేజీ, 15 కిలోల వంకాయలు, 30 కిలోల ముల్లంగి, 50 కిలోల చిలగడ దంపలు ఆలయం వద్ద ఆదివారం అందించారు.
కిరండూల్ పాసింజర్‌కు అదనపు కోచ్
తాటిచెట్లపాలెం (విశాఖ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ–కిరండూల్–విశాఖ పాసింజర్ రైలుకు అదనపు కోచ్‌ను జత చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే. పవన్‌కుమార్ ఆదివారం తెలిపారు. విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే రైలు (58501)కు సోమవారం నుంచి జనవరి 20వ తేదీ వరకు, అలాగే తిరుగు ప్రయాణంలో కిరండూల్ నుంచి విశాఖ వచ్చే రైలు (58502)కు మంగళవారం జనవరి 21వ తేదీ వరకు ఒక అదనపు జనరల్ కోచ్‌ను అందుబాటులో ఉంచుతున్నారు.


