తాంసి: వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబ డి రాదని ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకు న్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహా రం అందించి ఆదుకోవాలని రైతు స్వరాజ్య వే దిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు. కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యకు పా ల్పడిన భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి గ్రామానికి చెందిన రైతులు బుర్గుల అశోక్, ప సుపుల ఆశన్న కుటుంబాలను బుధవారం ప రామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలు, ఆర్థిక స్థితిగతులు, సాగు చేసిన పంటల వివరా లు, పెట్టుబడి ఖర్చు తదితర వివరాలు నమో దు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు నెలకు రూ.5వేల పింఛన్, పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కిసాన్మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటర్ రమాకాంత్, రవీందర్, శ్రీకాంత్ తదితరులున్నారు.


