సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

Oct 15 2026 8:54 AM | Updated on Oct 15 2026 8:54 AM

ఆదిలాబాద్‌టౌన్‌: సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సూచించారు. జాతీయ సైబర్‌ జాగృతి మాసోత్సవంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని డీటీసీలో పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై అభ్యర్థుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తక్కువ వడ్డీకే రుణాలిస్తామని ప్రాసెసింగ్‌ ఫీజులు, ఇతర చార్జీల పేరిట డబ్బులు వసూలు చేసే మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్‌ ఖాతా, ఓటీపీ, ఏటీఎం పిన్‌ వివరాలు ఎవరికీ చెప్పొద్దని తెలిపారు. ప్రభుత్వ అధికారుల పేరిట ఫోన్‌లో బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేస్తే వెంటనే జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. www.cybercrime.gov.in లో నూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి, వన్‌టౌన్‌ సీఐ సునీల్‌కుమార్‌, రూరల్‌ ఎస్సై విష్ణువర్ధన్‌, సైబర్‌ ఏఎస్సై సురేందర్‌, సిబ్బంది ఏసుదాస్‌, శివ, అహద్‌ తదితరులున్నారు.

తలమడుగు ఠాణా తనిఖీ

తలమడుగు: మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాలు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. గంజాయి సాగు, విక్రయాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి, రూరల్‌ సీఐ రహీం పాషా, ఎస్సై రాధిక తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement