కై లాస్నగర్: జిల్లాలోని హెచ్ఐవీ బాధితులందరికీ అవసరమైన ఉచిత మందులు అందేలా చూడాల ని, మిస్ ఇండికేటర్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా ను సురక్షిత్ జాబితాలో నిలపాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ వి భాగం ఆధ్వర్యంలో జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆ ర్గనైజేషన్ (నాకో) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేశ్ గు ప్తా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో బుధవా రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వైద్య, ఆ రోగ్యశాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రక్త నిధి కేంద్రాల ద్వారా స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించి తగినంత రక్తం నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ వి భాగం పనితీరుపై ఈనెల 27న ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డీఎంహెచ్వో సాధ న, అదనపు వైద్యాధికారి ఈశ్వర్రాజ్, జిల్లా ప్రో గ్రాం మేనేజర్ నాగరాజు, ఏఆర్టీ పద్మిని, అధికా రులు, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా అంగన్వాడీ ఇంటర్వ్యూలు
ఇంద్రవెల్లి మండలంలో ఖాళీగా ఉన్న తొమ్మిది అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఇంటర్వ్యూ ప్రక్రియ ముగి సింది. కలెక్టర్ రాజర్షి షా, ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్కుమార్తో కలిసి అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించగా అర్హత సాధించిన 56మందిలో 48 మంది హాజరయ్యారు. మెరిట్, నిబంధనల ప్రకార మే ఎంపిక ప్రక్రియ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. డీడబ్ల్యూవో మిల్కా, డీఎంహెచ్వో సాధన, గిరిజన సంక్షేమశాఖ పర్యవేక్షణ అధికారి జగన్ ఉన్నారు.


