రైతులకు ఇబ్బంది రానివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బంది రానివ్వొద్దు

Oct 15 2026 8:54 AM | Updated on Oct 15 2026 8:54 AM

ఆదిలాబాద్‌టౌన్‌: పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్‌ శాఖ వరంగల్‌ ఆర్జేడీ పద్మావతి సూచించారు. బుధవారం ఆదిలాబాద్‌ వ్యవసా య మార్కెట్‌ కమిటీ కార్యాలయాన్ని సందర్శించి మాట్లాడారు. దసరా తర్వాత కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చూడాలని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. మార్కెట్‌ యార్డులో మరుగుదొడ్లు, తాగునీరు, కాంటా లు, తేమ యంత్రాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈసారి మహారాష్ట్ర రైతులు తెచ్చిన పత్తి కూడా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. జిన్నింగ్‌ మిల్లులను అందుబాటులో ఉంచాలని సూచించారు. అంతకుముందు ఏ ఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పద్మావతికి స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. జి ల్లా మార్కెటింగ్‌ అధికారి గజానంద్‌, మార్కెట్‌ కార్యదర్శి విఠల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement