తాగునీటి ఎద్దడికి ‘చెక్‌’ పెట్టేలా.. | - | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడికి ‘చెక్‌’ పెట్టేలా..

Oct 15 2026 8:54 AM | Updated on Oct 15 2026 8:54 AM

● లాండసాంగ్వీ పంప్‌హౌస్‌ వద్ద చెక్‌డ్యాం నిర్మాణానికి కసరత్తు ● ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తి ● నవంబర్‌లో పనులు ప్రారంభం

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి భవిష్యత్‌లో నీటి ఎద్దడి తలెత్తకుండా, పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా తాగునీరు అందించే దిశగా అధి కార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్ర స్తుత ఎల్‌నినోతో నీటి కరువు తలెత్తకుండా ఉండేలా రూ.4.69 కోట్ల వ్యయంతో పట్టణానికి తాగునీ టిని సరఫరా చేసే లాండసాంగ్వీ పంప్‌హౌస్‌ వద్ద చెక్‌డ్యాం నిర్మాణానికి సంకల్పించింది. టెండర్ల ప్ర క్రియ, కాంట్రాక్టర్‌ నిర్మాణానికి సంబంధించి అగ్రి మెంట్‌ పూర్తయింది. వాగులో నీటి ప్రవాహం తగ్గిన తర్వాత నవంబర్‌ మొదటి వారంలో పనులు ప్రా రంభించేలా ఇరిగేషన్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి నాటికి నీటిని నిల్వ ఉంచేలా పనులు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.

కలెక్టర్‌ ప్రత్యేక చొరవ

49వార్డులు కలిగిన ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ క్ర మంగా విస్తరిస్తోంది. ఇళ్ల నిర్మాణల సంఖ్య పెరుగుతుండటంతోపాటు పట్టణ జనాభా కూడా పెరుగుతోంది. దీంతో ప్రజల నీటి అవసరాలూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం లాండసాంగ్వీ పంప్‌హౌస్‌ నుంచి పట్టణానికి నిత్యం 5ఎంఎల్‌డీల నీరు సరఫరా అవుతోంది. పెరుగుతున్న జనాభా భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా నీటిని అందించాలని బల్ది యా భావించింది. ఇందుకోసం లాండసాంగ్వీ పంప్‌హౌస్‌ వద్ద నీటి సామర్థ్యాన్ని పెంచేలా చెక్‌డ్యాంలు నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందని నిర్ణయించింది. దీనిపై మున్సిపల్‌ యంత్రాంగంతో పాటు చైర్‌పర్సన్‌ కలెక్టర్‌ రాజర్షి షా దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తులపై ప్రత్యేక చొరవ చూపిన కలెక్టర్‌ దీని పై ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ద్వారా ప్రభుత్వానికి పంపించారు. దీని ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం చెక్‌డ్యాం నిర్మాణానికి పాలనా అనుమతులు మంజూరు చేసింది.

చెక్‌డ్యాం నిర్మాణ వివరాలు

నిర్మాణ పొడవు 120 మీటర్లు

నిర్మాణ లోతు 2.5 మీటర్లు

నిర్మాణ వ్యయం రూ.4.69 కోట్లు

నీటి నిల్వ సామర్థ్యం 11.89 కోట్ల లీటర్లు

నవంబర్‌లో పనులు ప్రారంభిస్తాం

లాండసాంగ్వీ పంప్‌హౌస్‌ వద్ద చెక్‌డ్యాం నిర్మాణ పనులను నవంబర్‌ మొదటి వారంలో ప్రారంభిస్తాం. ప్రజలు రాకపోకలు సాగించే లాండసాంగ్వీ బ్రిడ్జికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా నిర్మాణం డిజైన్‌ చేశాం. ఈ చెక్‌డ్యాం నిర్మాణంతో కిలో మీటర్‌ మేర భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది.

– సాగర్‌, ఇరిగేషన్‌శాఖ ఏఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement