మంత్రివర్యా.. ఇదీ సమస్య | - | Sakshi
Sakshi News home page

మంత్రివర్యా.. ఇదీ సమస్య

Oct 15 2026 8:54 AM | Updated on Oct 15 2026 8:54 AM

వాట్సాప్‌ నంబర్‌కు వినతుల వెల్లువ

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పేషీకి 200కు పైనే..

అధికారులను కలువకుండానే ప్రజల ఫిర్యాదులు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాట్సా ప్‌ నంబర్లకు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలు ఉన్నవారు నేరుగా అధికారులను కలువకుండా నే ఎప్పుడైనా.. ఎక్కడి నుంచైనా తమ గోడు విన్నవించుకునే అవకాశం కలిగింది. దీంతో అనేకమంది సులువుగా ఫిర్యాదులు పంపిస్తున్నారు. ఈ నెల 8 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో నాలుగు జిల్లాల కలెక్టర్లతోపాటు ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేషీలోనూ ప్రత్యేకంగా వాట్సాప్‌ నంబర్‌ అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లా వాసులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. వారం రోజుల వ్యవధిలోనే వందలాది అర్జీలు ఈ వాట్సాప్‌ నంబర్లకు అందాయి. ఆయా సమస్యలపై వస్తున్న ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపితే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేకంగా ఈ అర్జీలను పరిశీలిస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నంబర్లకు ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, నిర్మాణంలో ఉన్న ఇళ్ల బిల్లుల మంజూ రు సమస్యలపై అధికంగా వచ్చాయి. వీటితోపాటు ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజాఫిర్యాదుల విభాగానికి వచ్చే భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా పింఛన్లు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అర్జీలు అందుతున్నాయి. అయితే ఇప్పటికే మండల, జిల్లా స్థాయిలో ప్రజాఫిర్యాదుల కో సం ప్రత్యేకంగా ప్రతీ సోమవారం నేరుగా అధికారులకు వినతులు ఇస్తున్నారు. అనేక సమస్యలు అలా గే పెండింగ్‌లో ఉంటున్నాయి. కొన్నిచోట్ల అర్జీల పరి ష్కారం కోసం ఫిర్యాదుదారులు నెలల తరబడి తిరుగుతున్నారు. తాజాగా వాట్సాప్‌ నంబర్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సమస్యలు పరి ష్కారం అయితేనే ప్రజలకు ఊరట కలిగే అవకాశం ఉంది. మంత్రి పేషీకి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

మంత్రి పేషీకి వచ్చినవి

జిల్లా అర్జీలు

ఆదిలాబాద్‌ 93

నిర్మల్‌ 33

కుమురంభీం 30

మంచిర్యాల 50

ఇతర ప్రాంతాలు 20

మొత్తం 226

ఫిర్యాదులకు వాట్సాప్‌ నంబర్లు

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జీ

మంత్రి పేషీ 85006 89596

ఆదిలాబాద్‌ 94923 41947

నిర్మల్‌ 83175 57897

కుమురంభీం 75699 86036

మంచిర్యాల 94921 23642

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement