లారీ ఢీకొని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని మహిళ మృతి

Oct 15 2026 8:24 AM | Updated on Oct 15 2026 8:24 AM

ముధోల్‌: భైంసా –బాసర జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ముధోల్‌ సీఐ రవీందర్‌ నాయక్‌, ఎస్సై బిట్లా పెర్సిస్‌ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం కల్దుర్తి గ్రామానికి చెందిన లక్ష్మి (68) భైంసా మండలం కోతుల్‌గాం గ్రామంలో సోదరుని ఇంటికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ముధోల్‌లోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద బస్సు కోసం రోడ్డు దాటుతుండగా బాసర నుంచి భైంసా వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో లక్ష్మి తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. మాజీ మ్మెల్యే విఠల్‌రెడ్డి అటుగా బాసర మండలానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.

బస్సు దిగుతుండగా ప్రమాదం

లక్ష్మణచాంద: ఆర్టీసీ బస్సు ఎక్కిన మహిళ మళ్లీ కిందకు దిగే క్రమంలో కింద పడి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మణచాందకు చెందిన కొట్టూరి చంద్రకళ బుధవారం నిర్మల్‌ వెళ్లేందుకు బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కింది. అప్పటికే బస్సులో ఎక్కువ మంది ఉండడం.. తన కుమార్తె బస్సు ఎక్కకపోవడంతో మళ్లీ కిందకు దిగే క్రమంలో జారీ రోడ్డుపై పడింది. దీంతో కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారాం అందుకున్న 108 సిబ్బంది ఆమెను నిర్మల్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చంద్రకళకు కాలు రెండు చోట్ల విరిగినట్లు తెలుస్తోంది. ఈఎంటీ దీపక్‌, పైలట్‌ నవీన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement