ఆదిలాబాద్‌టౌన్: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రె గ్యులరైజ్ చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ జి ల్లా ప్రోగ్రాం ఆఫీసర్ దేవిదాస్ నాయక్ డిమాండ్ చేశారు. నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చేదాకా నిరవధిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు శ్రీకాంత్, గితేశ్, ప్రవీణ్, శివ, రమణ, నాగార్జున్, సునీత, రాజారెడ్డి, రాజ్‌కుమార్, ఆదిత్య, గోపాల్ తదితరులున్నారు.


