నేరడిగొండ: మండలంలోని కుంటాల, చిన్న బుగ్గారం గ్రామాల్లో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం ప్రారంభించారు. ఆయా గ్రామాల సర్పంచులు రాథోడ్ సావిత్రి, జాదవ్ ఉజ్వల, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, ఎంపీడీవో గంగాసాగర్‌రెడ్డి, ఎంపీవో జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బోథ్ ఎక్స్ రోడ్డు పరిశీలన
బోథ్: బోథ్‌ఎక్స్‌రోడ్డును ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప రిశీలించారు. ఎక్స్ రోడ్డు వద్ద రాత్రివేళ ప్రజలు, వా హనదారులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. రెండు రోజుల్లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మోర్కండి వద్ద వంతెన నిర్మాణ స్థలం..
బజార్‌హత్నూర్: మండలంలోని మోర్కండి వద్ద రూ.1.86 కోట్ల ఆర్‌అండ్‌బీ నిధులతో త్వరలో చేపట్టనున్న వంతెన నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. అనంతరం గోకొండ సర్పంచ్ రాథోడ్ ప్రవీణ్ కుమారుని జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. మెడిసిన్ సీటు సాధించిన దాబాడి గ్రామానికి చెందిన పడ్వల్ సతీశ్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు. సర్పంచులు పరచ సాయన్న, మడవి కైలాస్, ప్రవీణ్, సుధీర్‌రెడ్డి, నాయకులు రాజారాం, చంద్రశేఖర్, విద్యాసాగరావు, గోవింద్‌నాయక్, రవీందర్, కార్తిక్, నానక్‌సింగ్, రవీందర్‌రెడ్డి, చందర్‌సింగ్ పాల్గొన్నారు.


