రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి

Oct 14 2026 1:53 AM | Updated on Oct 14 2026 1:53 AM

● కలెక్టర్‌ రాజర్షి షా ● కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష

కై లాస్‌నగర్‌: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మంది రంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో కలిసి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు ఆక్రమణలను తొలగించాలని, గుంతలు పడి న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాద సూచిక బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు, రేడియం లైట్లు, బ్లింకర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతరం వాహన తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధించాలని, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ పోలీస్‌ శాఖకు సహకారం అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ ఆర్‌ఎస్‌ చిత్రు, సబ్‌ కలెక్టర్‌ ప్రణయ్‌కుమార్‌, డీఎంహెచ్‌వో సాధన, రవాణాశాఖ అధికారి కిశోర్‌, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ తదితరులున్నారు.

మాదక ద్రవ్యాల నిర్మూలనపై..

కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ రాజర్షిషా గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఆదిలాబాద్‌ను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలు, సరిహద్దు తనిఖీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి విక్రయదారులు, సరఫరాదారుల పూర్తి వివరాలు సేకరించి పీడీ యాక్ట్‌తోపాటు కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

ఆహారభద్రత అధికారులతో..

ఆహార భద్రత అధికారులతో సమీక్షిస్తూ.. జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా తనిఖీలు ముమ్మరం చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. కల్తీ ఆహారం విక్రయించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు కలెక్టర్‌ చిత్రు, సబ్‌ కలెక్టర్‌ ప్రణయ్‌కుమార్‌, డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఆహార భద్రత అధికారి ప్రత్యూష, పోలీస్‌, ఎకై ్సజ్‌, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement