కైలాస్‌నగర్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదా రులకు సకాలంలో ఆర్థికసాయం చెక్కులు అందజేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారులకు సూచించారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ అర్బన్‌కు చెందిన 166 మంది, రూరల్‌కు చెందిన 45మంది, మావల మండలా నికి చెందిన 10మందికి కల్యాణలక్ష్మి, షాదీముబార క్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. పథకాల అమలులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ఏఎంసీ చైర్మన్ బొరంచు శ్రీకాంత్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య, తహసీల్దార్లు శ్రీనివాస్, వేణుగోపాల్, గోవింద్, డీటీ రాథోడ్ రాజేశ్వరి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ప్రజాసమస్యలు విస్మరించి నిరసనలా?
ఆదిలాబాద్: రాష్ట్రంలో ప్రజాసమస్యలను విస్మరించి ఎస్‌ఐఆర్ పేరిట ఢిల్లీలో నిరసనలు చేపట్టడం ఏ మిటని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. జి ల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయ ప్రయోజనా ల కోసమే కాంగ్రెస్ ఎన్నికల సంఘంపై విమర్శలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల జాబితాలో ఓట్ల తొలగింపుపై అభ్యంతరాలుంటే ఆధారాలతో ప్ర శ్నించాలని సూచించారు. సీఎం, మంత్రులు తమ పనితీరు మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నాయకులు జోగు రవి, కృష్ణయాదవ్, ప్రవీణ్, రఘుపతి, శ్రీకాంత్, జీవన్, సాయి, సుభాష్, సతీశ్, జ్యోతి, పద్మ తదితరులున్నారు.


