సర్వేలో వేగం పెరిగేనా? | - | Sakshi
Sakshi News home page

సర్వేలో వేగం పెరిగేనా?

Oct 14 2026 1:53 AM | Updated on Oct 14 2026 1:53 AM

● జిల్లాకు మరో ఎనిమిది రోవర్లు ● బృందాల వారీగా కేటాయింపు ● ఊపందుకోనున్న సర్వే ప్రక్రియ

● సిద్ధమైన లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

కైలాస్‌నగర్‌: భూ సమస్యలు పరిష్కరించడంతోపా టు ప్రతీ రైతుకు హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వేకు ఇటీవల శ్రీకా రం చుట్టింది. జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా రెండు గ్రా మాల్లో చేపట్టిన సర్వే విజయవంతం కాగా, మరో 70 గ్రామాల్లో పూర్తిస్థాయిలో రీ సర్వే చేపట్టాలని ని ర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా లైసెన్స్‌డ్‌ స ర్వేయర్లను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణా ఇ చ్చింది. గత ఫిబ్రవరిలో రీసర్వే ప్రారంభం కాగా, రోవర్ల కొరత, సర్వేకు లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల విముఖత కారణంగా ప్రక్రియ నత్తనడకన సాగింది. ఎని మిది నెలల్లో నాలుగు గ్రామాల్లోనే సర్వే పూర్తికా వడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించింది. దీంతో అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుండగా ఇప్పటికై నా సర్వే వేగవంతమవుతుందా? లేదా? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి

భూ వివాదాలకు పూర్తిగా చెక్‌పెట్టి, ప్రతీ రైతుకు భూదార్‌కార్డు జారీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూసర్వేకు శ్రీకారం చుట్టింది. ఎప్పుడో నిజాం కా లంలో జరిగిన సర్వేలోని లోటుపాట్లు సవరించి డి జిటల్‌ విధానంలో ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మ్యాపులతో కూడిన రికార్డుల ప్రక్షాళనకు ని ర్ణయించింది. జిల్లాలోని 21మండలాలకు ప్రస్తుతం తొమ్మిదిమంది మాత్రమే రెగ్యులర్‌ సర్వేయర్లున్నా రు. ఇందులోనూ ఇద్దరు డిప్యూటీ సర్వేయర్లు మండల సర్వేయర్లుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థిత్లులో సర్వేను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను ఎంపిక చేసింది. జిల్లాలో మూడు విడతల్లో 122 మందికి శిక్షణ ఇచ్చి వారికి లైసెన్స్‌లు జారీ చేశారు. అయితే, వారు విధుల నిర్వహణకు ముందుకు రాకపోవడం, సర్వేయర్ల కొరత ఉండటం, త గినన్ని రోవర్లు లేక భూ సర్వే ఆశించినస్థాయిలో జరగలేదు. జిల్లాలోని ఉట్నూర్‌ మండలంలో తేజాపూర్‌–జే, హీరాపూర్‌–జే, ఇచ్చోడలో గుండి, బజార్‌హత్నూర్‌లో గంగాపూర్‌, సిరికొండలో లక్ష్మింపూర్‌–కే, నేరడిగొండలో కుప్టి–బీ లాంటి ఆరు గ్రామాల్లోనే సర్వే ప్రక్రియ పూర్తయింది. మిగతా గ్రామాల్లో నత్తనడకన మొక్కుబడిగా సాగుతోంది.

సర్వే వేగవంతం చేస్తాం

జిల్లాలో భూ సర్వే ప్రక్రియ మందకొడిగా సాగిన మాట వాస్తవమే. రోవర్లు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు రాకపోవడంతోనే ప్రక్రియలో జాప్యం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. దీంతో కొత్తగా ఎనిమిది రోవర్లు జిల్లాకు కేటాయించారు. వాటిని సర్వే బృందాలకు అప్పగించాం. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు కూడా సర్వేకు ముందుకువకొచ్చారు. దీంతో సర్వే ప్రక్రియలో వేగం పెంచి పారదర్శకంగా జరిగేలా చూస్తాం.

– ఎల్‌.ప్రభాకర్‌, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement