● కుప్టి ఘాట్‌పై రోజుకో ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

● కుప్టి ఘాట్‌పై రోజుకో ప్రమాదం

Oct 14 2026 1:53 AM | Updated on Oct 14 2026 1:53 AM

● కుప్టి ఘాట్‌పై రోజుకో ప్రమాదం

కారును ఢీకొన్న లారీ

నేరడిగొండ: వుండలంలోని కుప్టి ఘాట్‌ జాతీయ రహదారి ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఆ మార్గంలో నిత్యం రోజుకో ప్రమాదం జరుగుతుండటంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మంగళవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్‌కు చెందిన కేజేశ్వర్‌, మరో ముగ్గురు పనుల నిమిత్తం భైంసాకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో కారులో ఉట్నూర్‌ వస్తుండగా కుప్టి ఘాట్‌ వద్దకు రాగానే ఎదురుగా అతివేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని లారీ బలంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తు కారులో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. కుప్టి ఘాట్‌ రోడ్డుపై వరస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయడమే కాకుండా, హిట్‌ అండ్‌ రన్‌కు పాల్పడిన లారీని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement