ఇంద్రవెల్లి: మండలంలోని హీరాపూర్ సమీపంలో ఓ రైతు వ్యవసాయ బావిలో ఇద్దరు అన్నదమ్ముల మృతదేహాలు లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల మేరకు మండలంలోని హర్కపూర్తాండకు చెందిన అన్నదమ్ములు రాథోడ్ అరవింద్ (35), రాథోడ్ ప్రవీణ్ (32) మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 11న ఉదయం సాలేవాడకు పనికి వెళ్తున్నామని చెప్పి వెళ్లారు. రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం హీరాపూర్ సమీపంలో ఓ రైతు వ్యవసాయ బావిలో మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అ ందించారు. యువకుల మృతి పై కుటుంబ సభ్యులతో పా టు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. అరవింద్కు భా ర్య శిరీష, కుమారుడు, ఇద్దరు కూతుర్లు, ప్రవీణ్కు భార్య గీ త, కుమారుడు, కూతురు ఉ న్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


