మేకల కాపరులపై అటవీ అధికారి దాడి | - | Sakshi
Sakshi News home page

మేకల కాపరులపై అటవీ అధికారి దాడి

Oct 14 2026 1:53 AM | Updated on Oct 14 2026 1:53 AM

● అటవీ శాఖ కార్యాలయం ఎదుట గిరిజనుల ఆందోళన

● అటవీ శాఖ కార్యాలయం ఎదుట గిరిజనుల ఆందోళన

పెంబి: నిర్మల్‌ జిల్లా పెంబి మండలం కొలాంగూడ గ్రామానికి చెందిన ఆత్రం శేషారావు, తాటిగూడ గ్రామానికి చెందిన గుగ్లావత్‌ శ్రీను గిరిజనులు మేకలు మేపేందుకు రోజులాగే అటవీ ప్రాంతానికి వెళ్లారు. అడవిలోకి ఎవరు రమ్మన్నారని పెంబి రేంజ్‌ డీఆర్‌వో ప్రతా ప్‌ నాయక్‌ వారిని చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన శేషారావును చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఖానాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను నిరసిస్తు పెంబి అటవీ శాఖ కార్యాలయం ఎదుట ప్రధాన ర హదారిపై మంగళవారం లంబాడా, ఆదివా సులు రాస్తారోకో నిర్వహించారు. గిరిజనులపై దాడిచేసిన అటవీ అధికారిపై కేసు న మోదు చేయడంతో పాటు చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు. అటవీ అధికారిపై చర్య తీసుకుంటామని హమీ ఇచ్చే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. ఆదివాసులకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement