కైలాస్‌నగర్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్లయినా మంజూ రైన వాటిలో సగం కూడా పూర్తికాలేదు. ఇప్పటికే వే లాది నిర్మాణాలు ఇంకా పునాదుల దశ దాటలేదు. మరికొన్ని వేల ఇళ్లకు లబ్ధిదారులు ముగ్గు కూడా పో యలేదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని ఆది వాసీలకు ఇళ్లు మంజూరైన సంతోషం కూడా దక్కలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మిగతా వేలాది ఇళ్లు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కాగా, ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సన్నద్ధమవుతోంది. ఈ విడతలోనైనా నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతాయా? లేదా.. మొదటి విడత లాగే మొక్కుబడిగా కొనసాగుతాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలనే స దుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 11న ఇందిరమ్మ పథకానికి శ్రీకారం చుట్టింది. తొలి విడతలో జిల్లా వ్యాప్తంగా నివేశన స్థలాలున్న 17,276 మందికి ఇళ్లు మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయాన్ని అందజేస్తోంది. నిర్మాణాలు చేపట్టిన రెండేళ్లలో ఇప్పటివరకు 4,247 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 883, బోథ్ నియోజకవర్గంలో 503, రెండేసి మండలాలు కలిగిన ఖానాపూర్ నియోజకవర్గంలో 539, ఆసిఫా బాద్ నియోజకవర్గంలో 162 ఇళ్లు ఇప్పటికీ ప్రారంభానికే నోచుకోలేదంటే ఈ పథకంపై హౌసింగ్ అధికారులకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. అలాగే, ఆదిలాబాద్ నియోజకవర్గంలో 520, బోథ్‌లో 563, ఆసిఫాబాద్‌లో 86, ఖానాపూర్‌లో 169 ఇళ్లు ఇంకా పునాదులకే పరిమితమయ్యా యి. ఇంటి నిర్మాణాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా సాగేలా చూడాల్సిన సంబంఽధిత అధికారులు ఆ దిశగా చొరవ చూపడంలేదు. లబ్ధిదారులు మొర పెట్టుకుంటేనే వచ్చి నిర్మాణ దశల ఫొటోలు తీసుకుంటున్నారనే ఆరోపణలు న్నాయి. పనులు వేగవంతమయ్యేలా పర్యవేక్షించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆదివాసీల ఆనందం ఆవిరి
ఏళ్లుగా గుడిసెల్లో జీవిస్తున్న ఆదివాసీ గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినా పలువురు ఆది వాసీలకు ఆ ఆనందం దక్కడం లేదు. ప్రధానంగా ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోని ఇంద్రవెల్లి మండలంలో 37, ఉట్నూర్‌లో 502, నార్నూర్‌లో 27, గాదిగూడ మండలంలో 135ఇళ్లు ప్రారంభానికి నోచుకో వడం లేదు. రిజర్వ్ ఫారెస్ట్, కవ్వాల్ టైగర్ జోన్ పే రిట అటవీ అధికారులు అనుమతులు ఇవ్వకపోవ డం ఇళ్ల నిర్మాణాలకు అడ్డంకిగా మారుతోంది. దీంతో తమ సొంతింటి కలను ఎలా సాకారం చేసుకో వాలని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా మండలాల పరిధిలో 255 ఇళ్లు ఇంకా పునా దుల దశ కూడా దాటలేదు. అటవీ అడ్డంకుల సమస్య ఉన్న వారికి ప్రత్యామ్నాయ స్థలాలు చూ పించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తు న్నా ఆ దిశగా అడుగు ముందుకు పడటంలేదు. దీంతో ఇళ్లు నిర్మించుకోవాలని భావిస్తున్న ఆదివాసీల కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండో విడతలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడటంతోపాటు అటవీ సమస్య అధిగమించేలా చర్యలు తీసుకోవాలని ఆదివాసీలు కోరుతున్నారు.
పూర్తి చేసేలా చూస్తాం
మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. స్లాబ్ దశలోని నిర్మాణాలు పూర్తి చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇటీవలి వరకు ఫైనల్‌బిల్లు మంజూరులో కొంత ఆలస్యమైంది. మార్చి 31వరకు పూర్తి చేసిన ఇళ్లన్నింటికీ బిల్లు మంజూరైంది. ప్రభుత్వం నుంచి బిల్లుల మంజూరులో ప్రస్తుతం ఎలాంటి జాప్యం లేదు. ఆర్‌ఎల్, ఆర్‌సీ దశలోని ఇళ్లన్నింటినీ త్వరలో పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
– రెడ్డి శంకర్, హౌసింగ్ పీడీ
నిర్మాణాల్లో జాప్యానికి కారణాలివే..


